ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ మనదే: హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్
- క్యాన్సర్‌పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర యుద్ధం ప్రకటించిందన్న అనుప్రియ పటేల్
- ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్ కార్యక్రమం దేశంలో అమలు
- బసవతారకం ఆస్పత్రి సేవలను కొనియాడిన కేంద్ర మంత్రి
- ఆయుష్మాన్ భారత్ ద్వారా 62 కోట్ల మందికి క్యాన్సర్ చికిత్స భద్రత
- బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తున్నామన్న మంత్రి
క్యాన్సర్ మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర యుద్ధం ప్రకటించిందని, ఇందులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా అనుప్రియ పటేల్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా 1.84 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ల (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) ద్వారా 30 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమం కింద ఇప్పటివరకు 35 కోట్ల మందికి ఓరల్ క్యాన్సర్, 16 కోట్ల మంది మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్, 9 కోట్ల మందికి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పూర్తి చేశామని పేర్కొన్నారు. ముందస్తుగా వ్యాధిని గుర్తిస్తే ప్రాణాలు కాపాడవచ్చని, చికిత్సా భారాన్ని తగ్గించవచ్చని ఆమె అన్నారు.
క్యాన్సర్ చికిత్సకు అవసరమైన మౌలిక సదుపాయాలను భారీగా పెంచామని, 2014కు ముందు 384గా ఉన్న మెడికల్ కాలేజీల సంఖ్య ఇప్పుడు 820కి చేరిందని తెలిపారు. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) కింద 62 కోట్ల మంది పేదలకు క్యాన్సర్ చికిత్సలో ఆర్థిక భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. జన్ ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే మందులు అందిస్తున్నామని గుర్తుచేశారు. నివారణ చర్యల్లో భాగంగా 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించారు.
స్వర్గీయ ఎన్టీ రామారావు దార్శనికతతో, బసవతారకం గారి స్ఫూర్తితో ఏర్పాటైన ఈ ఆసుపత్రి, గత 25 ఏళ్లుగా పేదలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన సేవలు అందించడం అభినందనీయమన్నారు. ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆసుపత్రి చేస్తున్న సేవలను కొనియాడారు. అమరావతిలో కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆసుపత్రికి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.